: ముద్రగడ అనుకున్నది సాధిస్తారు!... కాపు నేతకు కేంద్రం రక్షణ కల్పించాలన్న వీహెచ్!


కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని టీ కాంగ్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు పరామర్శించారు. నేటి ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చేరుకున్న వీహెచ్ ఇటీవల నిరాహార దీక్ష చేసిన ముద్రగడను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ తాను అనుకున్నది సాధిస్తారన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ముద్రగడకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కూడా వీహెచ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News