: రంజాన్ సీజనులో మత ఘర్షణలు రేపేందుకు ఉగ్రవాదులు వేసిన మాస్టర్ ప్లాన్!


ఈ రంజాన్ సీజనులో తమంతట తాముగా దాడులు జరపకపోయినా, హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు జరిగేలా చూడాలని నిన్న అరెస్టయిన ఉగ్రవాద ముఠా సభ్యులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. రాత్రుళ్లు వివిధ దేవాలయాల్లో ఆవు మాంసాన్ని విసిరేస్తే చాలని, ఆపై తామేమీ చేయక్కర్లేదని వీరు భావించారట. ఎన్ఐఏ వర్గాలు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించినట్టు 'ఆజ్ తక్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం వీరి లక్ష్యమని, అక్కడ ఆవు, గేదె మాంసాలను విసిరేస్తే చాలని అనుకున్నారని విచారణలో పాలుపంచుకున్న ఆ అధికారి చెప్పారు. ఆవు మాంసం నాలుగు ముక్కలు, గేదె మాంసం నాలుగు ముక్కలు తేవాలని వీరి మధ్య సంభాషణలు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఆపై కొద్ది రోజుల తరువాత ప్రపంచాన్నే ఆకర్షించేలా ఓ పెద్ద మారణహోమానికి వీరు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో అధికారులు ఉన్నారు.

  • Loading...

More Telugu News