: రజనీ స్పెషల్ 'కబాలీ ఫ్లయిట్'... ప్రత్యేకతలివే!


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలీ' విడుదలకు సిద్ధమవుతున్న వేళ, మలేషియా సంస్థ ఎయిర్ ఆసియా, కబాలీ నిర్మాతలతో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా ప్రత్యేక థీమ్ తో అలంకరించిన కబాలీ స్పెషల్ ఫ్లయిట్ ను ప్రారంభించింది. విమానం వెలుపల భారీ రజనీ బొమ్మలతో, కబాలీ టైటిల్ తో పెయింట్ వేసుకున్న విమానంలో ప్రతిక్షణం రజనీని గుర్తుకు తెచ్చేలా ఏర్పాట్లు చేసింది. తొలిరోజున బెంగళూరు నుంచి చెన్నైకి ఈ విమానం ప్రయాణించగా, ప్రత్యేక కబాలీ థీమ్ మెనూను ప్రయాణికులకు అందించారు. విమానంలో 'నిప్పురా' వంటి కబాలీ సాంగ్స్ వినిపించారు. విమానంలోపల సైతం కబాలీ స్టిక్కర్లను అతికించారు. కబాలీకి సంబంధించిన తాజా సమాచారాన్ని పీఏ సిస్టమ్స్ లో చెప్పారు. ఈ విమానం న్యూఢిల్లీ, గోవా, పుణె, కొచ్చి వంటి పది భారత నగరాల మధ్య సర్వీసులు అందిస్తుందని ఎయిర్ ఆసియా నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News