: ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన... మరికాసేపట్లో తిరుగు పయనం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఐదు రోజులుగా చైనాలో జరుపుతున్న పర్యటన కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రపంచ ఆర్ధిక సదస్సు ఆహ్వానం మేరకు చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లిన చంద్రబాబు... ఆ సదస్సుకు హాజరవడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం ఐదు రోజులుగా బిజీబిజీగా సమావేశాలు నిర్వహించారు. చైనాకు చెందన పలు కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు మెరుగైన ఫలితాలనే సాధించారు. కొద్దిసేపటి క్రితం 200 మంది చైనా పారిశ్రామికవేత్తలతో ఆయన నిర్వహించిన సమావేశం ముగిసింది. దీంతో చైనాలో చంద్రబాబు పర్యటన ముగిసినట్లైంది. మరికాసేపట్లో అక్కడ ఫ్లైట్ ఎక్కనున్న చంద్రబాబు హాంకాంగ్ మీదుగా ఢిల్లీ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News