: భార్య ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అడ్డంగా బుక్కయిన భర్త
భార్యతో ఉన్న మనస్పర్థలతో ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సచిన్ జిందాల్‌తో మనస్పర్థల కారణంగా భార్య అతనికి దూరంగా గుర్‌గాంలో ఉంటోంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న సచిన్ భార్య ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆమె స్నేహితులకు అసభ్యకర సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. తన అకౌంట్ నుంచి వెళ్తున్న అసభ్య సందేశాలను చూసిన ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ను భర్తే హ్యాక్ చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు.