: ఐఎస్ ఉగ్రవాదుల పేరిట అరెస్టైన వారిలో ఆరుగురు అమాయకులేనట...!


మొన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు హైదరాబాదులోని పాతబస్తీలో చేసిన ముమ్మర సోదాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. గంటల తరబడి కొనసాగిన సోదాల్లో ఐఎస్ ఉగ్రవాదుల పేరిట ఎన్ఐఏ 11 మందిని అరెస్ట్ చేసింది. విడతలవారీగా జరిగిన ఈ ఈ అరెస్టుల్లో అదుపులోకి తీసుకున్న వారిని రహస్య ప్రాంతానికి తరలించిన అధికారులు విచారణ జరిపారు. అయితే నిన్న రాత్రికే అరెస్టైన 11 మందిలోని ఆరుగురు అమాయకులని తేలిపోయింది. దీంతో యాసర్, రిజ్వాన్, మహమ్మద్ రహమాన్, అబ్దుల్, ఎంఎం అజార్, మహ్మద్ అర్బాజ్ అహ్మద్ లను ఎన్ఐఏ అధికారులు వదిలిపెట్టారు. ఇక మిగిలిన ఐదుగురు అనుమానితులను వారు ఇంకా విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News