: మెట్రో రైలు ఎండీగా మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డే... తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాదు నగరంలోని మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే హైదరాబాదులో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైంది. అయితే పలు అడ్డంకుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి నత్తనడకన కొనసాగుతోంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు పనుల్లో కాస్తంత వేగం పుంజుకుంది. తొలి దశ పనులను పూర్తి చేసి త్వరలోనే మెట్రో రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే సంస్థ ఎండీ ఎన్వీఎస్ పదవీకాలం ముగియనుంది. కీలక తరుణంలో కొత్త అధికారికి బాధ్యతలు అప్పగించేందుకు ఇష్టపడని కేసీఆర్ సర్కారు... ఎన్వీఎస్ రెడ్డిని మరో ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.