: భాగ్యనగరిలో విశాఖ మహిళా టెక్కీ సూసైడ్... వరకట్న వేధింపులే కారణమంటున్న పేరెంట్స్


ఏపీలోని సాగర నగరం విశాఖకు చెందిన మహిళా టెక్కీ హరికీర్తన హైదరాబాదులోని సనత్ నగర్ లో ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల క్రితమే సనత్ నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భానుతేజతో హరికీర్తన వివాహమైంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇంటిలోనే ఆమె సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై హరికీర్తన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుతేజ, అతడి తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు భానుతేజ, అతడి తల్లిదండ్రులపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News