: సొంతూరుకి నారా లోకేశ్... రేపు కూడా అక్కడే ఉండనున్న టీడీపీ యువనేత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు వెళుతున్నారు. నేటి సాయంత్రానికి నారావారిపల్లె చేరుకోనున్న లోకేశ్ రాత్రి గ్రామంలోని తమ స్వగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం గ్రామానికి సమీపంలోని రామచంద్రాపురంలో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి సారించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నేతలతోనూ ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.