: మొదట రవిశాస్త్రికే ఫోన్ చేశాను: టీమిండియా హెడ్ కోచ్ కుంబ్లే
టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైన తర్వాత మొదట రవిశాస్త్రికే ఫోన్ చేశానని, అతను తనను అభినందించాడని అనిల్ కుంబ్లే చెప్పాడు. వెస్టిండీస్ పర్యటన నిమిత్తం టీమిండియాతో బెంగళూరులో శిక్షణ ప్రారంభించాడు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే మీడియాతో మాట్లాడుతూ, హెడ్ కోచ్ పదవికి ఎంపికైన తనను అభినందించిన రవిశాస్త్రితో, మనకు మంచి యువజట్టు ఉందని చెప్పానని అన్నాడు. భారత క్రికెట్ జట్టుకు రవి అద్భుత సేవలందించాడని కుంబ్లే కొనియాడాడు. మూడు ఫార్మాట్లలోనూ ముందుండే సత్తా భారత్ కు ఉందని తమ నమ్మకమని అన్నాడు. హెడ్ కోచ్ పదవిలో ఎవరూ శాశ్వతం కాదని, మార్పు తీసుకువచ్చే అవకాశం తనకు లభించిందని కుంబ్లే చెప్పాడు.