: జడ్జీలకు సెలవు కావాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలి... ఆదేశాలు జారీ!
న్యాయాధికారుల ప్రాథమిక జాబితాను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఆందోళనలు రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది మూకుమ్మడి సెలవుపై వెళ్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూకుమ్మడిగా సెలవుపై వెళ్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జిల్లా జడ్జీలకున్న సెలవు మంజూరు అధికారాన్ని ఉపసంహరించి ఆ బాధ్యతను తానే తీసుకుంది. ఇకపై జిల్లాల లోని జడ్జీలు సెలవుపై వెళ్లాలంటే హైకోర్టు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.