: ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారు?: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ మంత్రుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు రాజధాని సెంటిమెంట్ పేరిట అమరావతిలో అనవసర ఆర్భాటం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో సుమారు 200 ఏళ్లు దేశాన్ని పరిపాలించిన బ్రిటీషర్లు కూడా ఇంత హంగామా చేయలేదని ఆయన పేర్కొన్నారు. దివాళా తీసిన కంపెనీకి రాజధాని నిర్మాణ బాధ్యతలెలా అప్పగిస్తారని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News