: వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా


ఎయిరిండియా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పింది. నిన్న ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం వెనుక కారణాన్ని కేంద్ర మంత్రికి ఆ సంస్థ వివరించింది. గుర్గావ్ లోని సెక్టార్ 21లో నివసిస్తున్న ఎయిర్ ఇండియా పైలట్ నివాసానికి 9:45 నిమిషాలకు కారును పంపించామని, అయితే అది ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో వేరే కారు చూసుకుని విధులకు వెళ్లిపోవాలని డ్రైవర్ పైలట్ కు ఫోన్ ద్వారా తెలిపాడని, దీంతో ఆయన వేరే క్యాబ్ ను చూసుకుని ఎయిర్ పోర్టుకు వస్తుండగా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలోని ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడని దీంతో సమయానికి ఎయిర్ పోర్టుకు చేరుకోలేకపోయాడని ఎయిరిండియా తెలిపింది. దీంతో విమానం ఆలస్యంగా బయల్దేరగా, వెంకయ్యనాయుడు అపాయింట్ మెంట్స్ రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News