: ఈ ఫొటోనే సమాధానం చెబుతుందన్న హీరో విశాల్


తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో దక్షిణాది హీరో విశాల్ ప్రేమ వ్యవహారం నడుస్తోందని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ దాటవేస్తున్న విశాల్ ఈసారి మాత్రం తన సమాధానాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పాడు. విశాల్, వరలక్ష్మితో పాటు ఒక కుక్క పిల్ల ఉన్న ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోనే అన్నింటికి సమాధానం చెబుతుందంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. వరలక్ష్మితో తన ప్రేమను విశాల్ ఒప్పుకున్నట్లేనని ఈ ఫొటోయే చెబుతోందని తమిళ సినీ ఇండస్ట్రీ లోని వారు అనుకుంటున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News