: ఏపీలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ రాయితీ ...చార్జీల్లో 25 శాతం తగ్గింపు
ఏపీలో సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో 25 శాతం రాయితీ కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ, ఆర్టీసీలో తమకు రాయితీ కల్పించాలని రాష్ట్రంలోని పలు సీనియర్ సిటిజన్ల అసోసియేషన్ లు తమకు విజ్ఞప్తి చేశాయని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జులై 1 నుంచి సీనియర్ సిటిజన్లకు ఛార్జీల్లో రాయితీ అమల్లోకి రానున్నట్లు చెప్పారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో కూడా ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. రాయితీ పొందాలనుకునే సీనియర్ సిటిజన్లు తమ వయస్సు అరవై సంవత్సరాలకు పైబడి ఉందని ధ్రువీకరించుకోవలసి ఉంటుందని, అందుకోసం ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా డేటా ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ను టికెట్ తీసుకునే సమయంలో చూపించడం తప్పనిసరని సాంబశివరావు చెప్పారు.