: ప్రధానిని కలవలేకపోయారట... 30 నుంచి 'ఫ్రీడమ్ 251' డెలివరీ లేదు!


ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ గా భారతీయుల ముందుకు వచ్చిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ల డెలివరీ ముందు చెప్పినట్టుగా రేపటి నుంచి డెలివరీ చేయలేకపోతున్నట్టు సంస్థ ప్రకటించింది. జూలై 7 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ యాజమాన్యం మరోసారి మాట మార్చింది. తాము ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, తమ ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరాలని భావించామని, ఆయన అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదని ఫోన్లను పరిచయం చేసిన రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ మోహిత్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం తమ వద్ద 2 లక్షల ఫోన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశవాళీ స్మార్ట్ ఫోన్ వ్యవస్థను మరో మెట్టు ఎక్కించాలన్నదే తమ ఉద్దేశమని, వారం రోజుల ఆలస్యంగా డెలివరీ ప్రారంభమవుతుందని, ఈలోగా ప్రధానిని కలుస్తామని ఆయన అన్నారు. తొలి దశ డెలివరీల తరువాత మరోసారి బుకింగ్స్ స్వీకరిస్తామని తెలిపారు. తాము చేసిన తప్పేంటో తెలుసుకున్నామని, ఇకపై సైలెంటుగా ఉండి సంస్థను ముందుకు నడిపిస్తామని అన్నారు. ఒక్కో స్మార్ట్ ఫోన్ పై రూ. 140 నుంచి రూ. 150 నష్టం మిగలనుందని, అయితే, ప్రొడక్షన్ పెరిగే కొద్దీ లాభాల్లోకి వెళ్లగలమన్న నమ్మకముందని తెలిపారు.

  • Loading...

More Telugu News