: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ ఊరి కల... ఒక్క ట్వీట్ తో నెరవేరింది!


భనోలి సెరా... ఇండియా - చైనా సరిహద్దులకు సమీపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోరాగఢ్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ గ్రామం అభివృద్ధిని పట్టించుకున్న వారే లేరు. తమ ఊరికి ఓ పోస్టాఫీసు కావాలన్నది అప్పటి నుంచి వారి కల. ఈ 69 సంవత్సరాలుగా సమాచార వ్యవస్థ అందుబాటులో లేని భనోలి సెరా పడ్డ ఇబ్బందులు ఎన్నో! ఉద్యోగావకాశాలు కొందరు కోల్పోతే, అనారోగ్యాలతో సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వారెందరో. ఈ గ్రామం కోరిక ఇప్పుడు ఒక్క ట్వీట్ తో నెరవేరింది. సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ విషయాన్ని తెలుసుకుని ఈ నెల 21న తన ట్విట్టర్ ఖాతా ద్వారా విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. అంతే, నాలుగు రోజుల్లో ఆ గ్రామానికి పోస్టాఫీసు మంజూరైంది. ప్రస్తుతం ఓ తాత్కాలిక గదిలో పోస్టాఫీసు పని చేస్తుండగా, ఆ చిత్రాన్ని రాజ్ దీప్ ట్వీట్ చేశారు. ప్రజలు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News