: ఇక 24 గంటలూ తెరచుకునే బ్యాంకులు, మాల్స్, కిరాణా దుకాణాలు... కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా
అటు రీటెయిలర్లకు, ఇటు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, ఇకపై 24 గంటల పాటు బ్యాంకులు, మాల్స్, షాపులు, కిరణా దుకాణాలు తెరచివుంచుకునే సౌలభ్యాన్ని దగ్గర చేసే ప్రతిపాదిత మోడల్ షాప్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మారుతున్న కాలానికి అనుగుణంగా దైనందిన అవసరాలు మారుతున్న వేళ, వివిధ రాష్ట్రాల కోరిక మేరకు ఈ చట్టానికి ఆమోదం తెలుపుతున్నామని, ఇదే సమయంలో దేశమంతటా ఒకే రకమైన వర్కింగ్ కండిషన్స్ కోసమూ చట్టం ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇప్పటివరకూ షాపులు, మాల్స్ ఓపెనింగ్, క్లోజింగ్ సమయాలు రాష్ట్రాల చేతుల్లో ఉండగా, ఇకపై సమయపాలన ఉండదని, పరిస్థితులను బట్టి నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉంటుందని వివరించారు. మహిళలకు ఉపాధి విషయంలో, రిజిస్ట్రేషన్, వార్షిక ఫీజులు, రికార్డుల నిర్వహణ తదితరాల్లో ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం తీసుకుని ముందడుగు వేస్తామని అధికారులు తెలిపారు.