: తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు టీడీపీ పూర్తి మద్దతు: రేవంత్ రెడ్డి
హైకోర్టు విభజన చేయాలని, అన్యాయంగా న్యాయాధికారులను సస్పెండ్ చేశారని తెలంగాణలో న్యాయవాదులు కొనసాగిస్తోన్న నిరసనలపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. న్యాయవాదుల ఆందోళనకు టీడీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం న్యాయవాదుల అంశాన్ని పట్టించుకోకపోతే ప్రాంతీయ వైషమ్యాలు చెలరేగుతాయని ఆయన అన్నారు. గవర్నర్ నరసింహన్ ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు విభజన అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారని, ఇది భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.