: కొండపర్తి వద్ద కొట్టుకుపోయిన రహదారి... తాళ్లపాయి చెరువుకు గండి
వరంగల్ జిల్లా ములుగు డివిజన్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాడ్వాయి మండలంలోని కొండపర్తి వద్ద రహదారి కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలంలోని తాళ్లపాయి చెరువుకు గండి పడింది. గ్రామంలోని 30 ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. దీంతో గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.