: రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్.. హెచ్‌ఐసీసీ నుంచి హడావుడిగా రాజ్భవన్కు వెళ్లిన సీఎం


హైకోర్టు విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం కొన‌సాగిన‌ విష‌యం తెలిసిందే. స‌మావేశంలో మీడియాతో మాట్లాడుతోన్న‌ కేసీఆర్.. ఒక్క‌సారిగా అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఆయ‌న‌ హెచ్‌ఐసీసీ నుంచి నేరుగా రాజ్‌భ‌వ‌న్ కు వెళ్లారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి త‌న‌కు ఫోన్ రావడంతో ముఖ్యమంత్రి హడావుడిగా అక్క‌డి నుంచి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News