: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో లీ ఎకో రికార్డులు!


చైనా కేంద్రంగా ఇండియాలో స్మార్ట్ ఫోన్లు విక్రయిస్తున్న లీఎకౌ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఒక్క రోజులో రూ. 78.6 కోట్ల విలువైన 61 వేల స్మార్ట్ ఫోన్లను విక్రయించి ఇండస్ట్రీ రికార్డును సాధించినట్టు సంస్థ పేర్కొంది. తమ సంస్థ ఇండియాలో కాలు పెట్టి 5 నెలలు కాగా, ఇప్పటివరకూ 7 లక్షలకు పైగా ఫోన్ యూనిట్లను అమ్మినట్టు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతుల్ జైన్ తెలిపారు. నిన్న తమ సరికొత్త మోడల్స్ లీ2, లీ మ్యాక్స్ 2లను ఆన్ లైన్ ద్వారా అమ్మకాలకు ఉంచితే, అందుబాటులోని అన్ని ఫోన్లూ అమ్ముడయ్యాయని, తదుపరి ఫ్లాష్ సేల్ ను వచ్చే నెలలో నిర్వహిస్తామని వివరించారు. కాగా, ఈ రెండు ఫోన్లతో పాటు రూ. 1,990 విలువైన సీడీఎల్ఏ ఇయర్ ఫోన్లు, రూ. 4,900 విలువైన లీఎకో మెంబర్ షిప్ లను సంస్థ అందిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News