: ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణ కోస్తాతీరం వెంబడి 45-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.