: పేరు చెప్పకుండా... నరేంద్ర మోదీపై స్వామి విమర్శలు!
చీప్ పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం వల్ల దేశానికి జరిగే మేలు ఏమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికిన వేళ, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా, ప్రధాని పేరును వెల్లడించకుండా, విమర్శల బాణాలు వేశారు. "రాజకీయ నాయకులారా... కొత్త సమస్య: ఓ రాజకీయ నాయకుడు పబ్లిసిటీ కావాలని అనుకుంటే, 30 ఓబీ వ్యాన్లు ఇంటి బయట ఉంటాయి. చానళ్లు, ప్రచార డబ్బా కొట్టే వారి నుంచి 200 మిస్డ్ కాల్స్ వస్తాయి" అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని గురించి చేసినవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలి కాలంలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేళ, మిన్నకుండిన బీజేపీ నేతలు, అరుణ్ జైట్లీని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అరవింద్ సుబ్రమణియన్ తదితరులపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై ముప్పేట దాడి జరుగుతున్న వేళ, స్వామి, నిన్న కాస్తంత వేదాంతమూ వల్లించారు. భగవద్గీతలోని శ్లోకాలు గుర్తు చేసుకున్నారు.