: సదానంద గౌడపై టీ లాయర్ల ఫైర్!... సరూర్ నగర్ పీఎస్ లో కేంద్ర మంత్రిపై కంప్లైంట్!


‘ఢిల్లీలో ధర్నా చేస్తారా? చేసుకోండి’’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తేలికగా కొట్టిపారేసిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడపై తెలంగాణ న్యాయవాదులు భగ్గుమన్నారు. గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హైదరాబాదుకు వచ్చిన సందర్భంగా హైకోర్టు విభజనపై హామీ ఇచ్చిన సదానంద... ఆ తర్వాత తన వాగ్దానాన్ని మరిచారని లాయర్లు ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆసరా చేసుకుని సదానంద గౌడపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో టీ లాయర్లు కేసు పెట్టారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా సదానంద తమను మోసం చేశారని ఆ ఫిర్యాదులో టీ లాయర్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News