: 76 ఏళ్ల వయసులో కలరిపయట్టులో సత్తా చాటుతున్న వృద్ధురాలు!.. వైరల్ గా మారిన వీడియో!


‘కలరిపయట్టు’ అంటే తెలుసా? మార్షల్ ఆర్ట్స్ గా మనం పిలుచుకునే కరాటే, కుంగ్ ఫూ... కంటే ప్రసిద్ధిగాంచిన యుద్ధ విద్య. కేరళలో పుట్టిన ఈ యుద్ధ విద్యలో ఆరితేరితే... ప్రత్యర్థులను మట్టికరిపించడం చాలా ఈజీ. అది పురుషులు కావచ్చు. మహిళలు కావచ్చు... ఈ విద్యలో శిక్షణ తీసుకున్న వ్యక్తులను ఓడించడం అంత ఈజీ కాదు. అయితే ఈ యుద్ధ విద్యను నేర్చుకోవడం చాలా కష్టతరమైన పనే. ఇంతటి ప్రసిద్ధిగాంచిన కలరిపయట్టును గతంలోనే నేర్చేసుకున్న ఓ మహిళ... తన ముదిమి వయసులోనూ సత్తా చాటుతోంది. కేరళలోని వటకరలో ఉంటున్న 76 ఏళ్ల మీనాక్షియమ్మ... కర్ర చేతబట్టి రంగంలోకి దిగిందంటే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే. తాను నేర్చుకున్న విద్యను ఆసక్తి ఉన్న యువతకు నేర్పుతున్న మీనాక్షియమ్మ... ఇటీవల తన వద్ద శిక్షణ తీసుకున్న ఓ నడి వయసు పురుషుడితో తలపడింది. ముదిమి వయసులో ఉన్నా, నడి వయసులోని పురుషుడిని ఆమె ఎదుర్కొంది. డిఫెన్సే కాకుండా అటాకింగ్ లోనూ సత్తా చాటిన మీనాక్షియమ్మ విన్యాసం ప్రస్తుతం వీడియో రూపంలో సోషల్ మీడియాలోకి చేరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News