: హైదరాబాదు నుంచి సైకిల్ పై వెళ్లిన ఏసీటీఓ పద్మకు స్వాగతం పలికిన ఏపీ మంత్రులు
హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓగా పనిచేస్తున్న పద్మ గురించి విన్నారుగా? అమరావతికి తరలుతున్న మహిళా ఉద్యోగుల్లో స్ఫూర్తిని నింపేందుకు శనివారం నాడు సైకిలుపై విజయవాడకు బయలుదేరిన యువతి. పద్మ కొద్దిసేపటి క్రితం విజయవాడ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి చేరుకోగా, మంత్రులు శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమ స్వయంగా స్వాగతం పలికారు. సహచర ఉద్యోగులు చప్పట్లు, కేరింతలతో ఉత్సాహం నింపుతుంటే, ఆమె తన సైకిలుపై కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పద్మ మాట్లాడుతూ, అమరావతిలో మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భద్రత ఉందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించిన ఆమె, నవ్యాంధ్ర అభివృద్ధిలో చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని తెలిపారు.