: గోశాలను భారీ యంత్రాలతో తొలగించిన అధికారులు.. నిరసనగా విజయవాడలో బంద్
అభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చివేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడలో నేడు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని గోశాలను అర్ధరాత్రి భారీ యంత్రాలతో అధికారులు తొలగించారు. దీనిని నిరసిస్తూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. అభివృద్ధి కన్నా ఆలయాల పరిరక్షణే ముఖ్యమని, ఆలయాలను, గోశాలను తొలగించవద్దని కొన్ని రోజులుగా ధర్మ పరిరక్షణ సమితి, ప్రతిపక్ష పార్టీల నేతలు, భక్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటోన్న విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పలువురు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.