: తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ మరణం వెనుక నమ్మలేని నిజం!
తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించి, ఆపై తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న భారతీ వీరత్ మృతి వెనుక పలు నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటరితనం, మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. భారతి గతంలో లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారి, మరో మహిళతో కలిసి ఉంటోందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తగా, ఆ యువతి భారతిపై దాడి చేసి, విడిపోయి మరో వ్యక్తితో ఉంటోందని, ఈ కారణంగానే ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయి ఉండవచ్చని తెలుస్తోంది. వీరిద్దరూ నడిరోడ్డుపై కూడా గొడవపడ్డట్టు ఇరుగు పొరుగు వారు వెల్లడించారు. ఇక ఇటీవలే తనకు తెలిసిన ఓ న్యాయవాదికి ఫోన్ చేసిన భారతి, ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నానని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరిందట. కేసులో వెలుగుచూస్తున్న ఈ కోణాలన్నింటినీ పరిశీలిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మాత్రమే ఆమె మరణానికి గల కారణాలపై ఓ స్పష్టతకు వస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.