: పాక్ హైకమిషనర్‌కు ఝలక్కిచ్చిన ఎంఆర్ఎం.. ఇఫ్తార్ ఆహ్వానం వెనక్కి


పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు అర్ఎస్ఎస్ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఎంఆర్ఎం) ఝలక్కిచ్చింది. ఇఫ్తార్ విందుకు ఇచ్చిన ఆహ్వానాన్ని రద్దు చేసింది. కశ్మీర్‌లోని పాంపోర్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వచ్చేనెల (జూలై) 2న శనివారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు అబ్దుల్ బాసిత్‌ను ఎంఆర్ఎం ఆహ్వానించింది. రెండు రోజుల కిందట పాంపోర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 8మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటనలో పాక్ ప్రమేయముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించాల్సిన అబ్దుల్ బాసిత్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. దాడిని ఖండించనూ లేదు. దీంతో ఆయన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎంఆర్ఎం నిర్ణయించింది. ‘‘ఇఫ్తార్ విందుకు ఆయనను ఆహ్వానిస్తూ పాక్ హై కమిషన్‌కు ఈమెయిల్ పంపాం. అయితే ఉగ్రవాదులు జవాన్లపై విరుచుకుపడి 8 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనపై ఆయన ఇప్పటివరకు నోరు తెరవలేదు సరికదా, దాడిని సైతం ఖండించలేదు కూడా. అందుకే ఆయన ఆహ్వానాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని మంచ్ జాతీయ కన్వీనర్ మొహమ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News