: ఇక వెలగపూడి నుంచే ఏపీ పాలన!... నేటి మధ్యాహ్నం తాత్కాలిక సచివాలయం ప్రారంభం!


నవ్యాంధ్రప్రదేశ్ పాలన ఇకపై ఆ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నుంచి సాగనుంది. అమరావతి పరిధిలోని వెలగపూడిలో కొత్తగా నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. నేటి మధ్యాహ్నం జరగనున్న ఈ ప్రారంభోత్సవంలో భాగంగా ఐదో బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో తొలుత నాలుగు శాఖలకు చెందిన సెక్రటేరియట్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి హైదరాబాదు నుంచి 200 మంది ఉద్యోగులు ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలివెళ్లనున్నారు. ఇక ఇప్పటికే విజయవాడ, గుంటూరు పరిసరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న వివిధ శాఖల ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్లనున్నారు. వీరి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా 11 బస్సులను ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News