: బుల్లెట్ల గాయాలతో రెండు కాళ్లు కోల్పోయిన తైక్వాండో ఛాంపియన్


బుల్లెట్ల గాయాల కారణంగా ఢిల్లీకి చెందిన తైక్వాండో ఛాంపియన్ రాజన్ (16) తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. వారం రోజుల క్రితం ఢిల్లీలోని భజన్ పురా ప్రాంతంలో రాజన్, ఆయన తండ్రిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ సంఘటనలో రాజన్ తండ్రి కైలాష్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజన్ కు మూడు బుల్లెట్ల గాయాలు తగిలాయి. దీంతో, రాజన్ నరాలు తీవ్రంగా దెబ్బతినడంతో అతని రెండు కాళ్లు తొలగించాల్సి వచ్చింది. రెండు కాళ్లు తొలగించకపోతే అతని ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. రాజన్ కు కృత్రిమ కాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఈ దాడికి గల కారణాలు తెలియలేదని, ఏడాది క్రితం రాజన్ సోదరుడు కూడా హత్యకు గురయ్యాడని పోలీసులు చెప్పారు. కాగా, తైక్వాండో బ్లాక్ బెల్టు సాధించిన రాజన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.

  • Loading...

More Telugu News