: చైనాలోని బుల్లెట్ ట్రైన్ లో చంద్రబాబు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు. చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు టియాంజిన్ నుంచి బీజింగ్ చేరుకునేందుకు బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. దీంతో, ఈ రెండు పట్టణాల మధ్యనున్న 140 కిలోమీటర్ల దూరాన్ని ఆయన కేవలం 31 నిమిషాల్లోనే చేరుకున్నారు. ఈ ట్రైన్ గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూనే... అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ ట్రైన్లను ప్రవేశపెట్టే అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రి యనమల కూడా ఉన్నారు.