: మెక్ కల్లమ్ డ్రీమ్ టీమ్ ఇదే!
ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు తమ కెరీర్ ముగిశాక... ఫలానా దిగ్గజాలతో ఆడి వుంటే బాగుండేదని భావిస్తుంటారు. ఈ క్రమంలో ఓ కలల జట్టు (డ్రీమ్ టీమ్)ను ఊహించుకుంటారు. అలాగే ఈ మధ్యనే కెరీర్ ముగించిన న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ కూడా ఓ కలల జట్టును ఎంచుకున్నాడు. 11 మంది ఆటగాళ్లతో కూడిన డ్రీమ్ టీమ్ ను వెల్లడించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కు మాత్రమే చోటు లభించగా, అతనికి జోడీగా ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసేందుకు క్రిస్ గేల్ ను ఎంచుకున్నాడు. ఫస్ట్ డౌన్ లో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ ను ఎంపిక చేశాడు. అతనితో పాటు మరో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వార్న్, మిచెల్ జాన్సన్ లను కూడా జట్టులోకి తీసుకున్నాడు. విండీస్ నుంచి దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, లారాను జట్టుకు ఎంపిక చేశాడు. సౌతాఫ్రికా నుంచి ప్రపంచ మేటి ఆల్ రౌండర్ జాక్వస్ కలిస్ ను ఎంపిక చేసిన మెక్ కల్లమ్, సహచరులు. న్యూజిలాండ్ ఆటగాళ్లు టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ లకు కూడా చోటు కల్పించాడు.