: ఏపీలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు... ప్రతీ మండలంలో జన ఔషధి కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే రోగులకు అత్యంత చవకగా నాణ్యమైన మందులు, ఇతర ఔషధాలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి అనంతకుమార్ అధ్యక్షతన జన ఔషధిపై సమావేశం నిర్వహించారు. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలోని ప్రతీ మండలంలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సమావేశంలో కేంద్రం ప్రభుత్వం తెలిపింది. దీని కోసం నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కొక్క కేంద్రానికి 2.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ కేంద్రాలను ప్రారంభించనుంది. తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందించనుంది.