: సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్ట‌డం లేదు: కోదండ‌రాం


తెలంగాణ‌లోని యూనివ‌ర్సిటీల స్థితిగ‌తుల‌పై హైద‌రాబాద్ తార్నాక‌లోని ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో తెలంగాణ ఐక్య కార్యాచ‌ర‌ణ సమితి(ఐకాస‌) ఈరోజు స‌మావేశం నిర్వ‌హించింది. మాజీ వైస్ ఛాన్స‌ల‌ర్స్, ఆచార్యులు, విద్యార్థులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. స‌మావేశంలో ప్రొ.కోదండ‌రాం మాట్లాడుతూ.. విశ్వ‌విద్యాల‌యాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. విశ్వ‌విద్యాల‌యాల‌కు ఉప‌కుల‌పతుల‌ను వెంట‌నే నియ‌మించాలని ఆయ‌న అన్నారు. స‌మాజ‌, ఆర్థిక అభివృద్ధిలో విశ్వ‌విద్యాల‌యాలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని కోదండ‌రాం అన్నారు. ప‌రిపాల‌న, నిధులు, వ‌స‌తులలేమితో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటున్నాయ‌ని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్ట‌డం లేదని ఆయన విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News