: ఫ్యాషన్ వస్త్రాల అమ్మకాలపై రిషికపూర్ సెటైర్!
స్పానిష్ ఫ్యాషన్ స్టోర్ ‘జారా’ అమ్మకాలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ జోక్ పేల్చారు. ‘బై టు గెట్ వన్ బెగ్గింగ్ బౌల్ ఫ్రీ’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అక్కడ అమ్మకాల నిమిత్తం పెట్టిన జీన్స్ ఫ్యాంట్లు, టాప్స్ అక్కడక్కడ చిరుగులతో ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై బాలీవుడ్ ప్రముఖులు పలువురు స్పందించారు. కాగా, సామాజిక మాధ్యమాల ద్వారా రిషికపూర్ తనదైన శైలిలో వేసే జోక్ లకు మంచి ఆదరణ ఉంది.