: వాహన చరిత్రలో అతిపెద్ద సెటిల్ మెంట్ ను కుదుర్చుకున్న ఫోక్స్ వాగన్!


ప్రపంచ వాహన చరిత్రలో అతిపెద్ద సెటిల్ మెంట్ డీల్ ను జర్మనీ వాహన సంస్థ ఫోక్స్ వాగన్ కుదుర్చుకుంది. మైలేజీ, కాలుష్యం వివరాల్లో తప్పుడు గణాంకాలు చూపి లక్షలాది కార్లను విక్రయించి అపఖ్యాతిని మూటగట్టుకున్న సంస్థ సుమారు రూ. 10,050 కోట్లు (150 కోట్ల డాలర్లు) పరిహారం ఇచ్చేందుకు మధ్యవర్తి ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా, తప్పుడు గణాంకాలతో విక్రయించిన ప్రతి కారు యజమానికి 10 వేల డాలర్లను (సుమారు రూ. 6.7 లక్షలు) ఇవ్వడంతో పాటు, వారి వాహనాన్ని ఉచితంగా రీప్లేస్ చేసేందుకు నిర్ణయించింది. వాహన కుంభకోణాల చరిత్రలో ఇదే అతిపెద్ద నష్టపరిహారమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుండగా, స్పందించేందుకు యూఎస్ పర్యావరణ పరిరక్షణ సమితి, ఫోక్స్ వాగన్ లు నిరాకరించాయి. ఫోక్స్ పై ఉన్న పలు కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులు అనుమతిస్తే ఈ పరిహారం కస్టమర్లకు అందుతుంది.

  • Loading...

More Telugu News