: చక్కెర వ్యాధికి చవకైన మందును విడుదల చేసిన సీఎస్ఐఆర్


శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి (సీఎస్‌ఐఆర్) టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం సరికొత్త ఆయుర్వేదిక్ యాంటీ డయాబెటిక్ ఔషధం 'బీజీఆర్-34'ను సరసమైన ధరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. లక్నోలోని ఎన్బీఆర్‌ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధిచేశాయి. కర్ణాటక, దాని సరిహద్దు రాష్ట్రాల్లో 5 రూపాయలకే దీనిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ ఏఐఎంఐఎల్ ముందుకు వచ్చింది. కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు తదితరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ ఔషధాన్ని తయారుచేశారు. కాగా, ఈ ఔషధం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి, శరీరంపై ఇతర ఔషధాల దుష్ర్పభావాలను తగ్గిస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌బీఆర్‌ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు.

  • Loading...

More Telugu News