: ఐసిస్ లో చేరుతానేమోనన్న భయంగా ఉంది...నన్ను అరెస్టు చేయండి: పోలీసులకి కువైట్ యువకుడి అభ్యర్థన


కువైట్ కు చెందిన ఓ యువకుడి అభ్యర్థన విని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో యువకులను అడ్డుకునేందుకు భద్రతాదళాలు రంగంలోకి దిగుతాయి. కానీ కువైట్ లో చిత్రంగా ఓ యువకుడు తాను ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యానని, తనను తక్షణం అరెస్టు చేయాలని పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తనను అరెస్టు చేయని పక్షంలో ఐసిస్ భావజాలం ప్రభావంతో తన కుటుంబాన్ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని సదరు యువకుడు పోలీసులకు స్పష్టం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News