: మామకు నివాళి అర్పించిన బాబు
పాదయాత్ర ముగింపు సభ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడు వేదికపైకి చేరుకోగానే తొలుత దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అనంతరం బాలకృష్ణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా వేదికపైకి చేరుకునే సమయంలో బాబుకు వేలాది మంది కార్యకర్తలు హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. కాగా, సభ ఆరంభంలో ఇటీవలే మరణించిన పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు, అంబటి బ్రాహ్మణయ్యలకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.