: ఈ రోజు 9 మంది న్యాయాధికారుల సస్పెన్షన్


తెలంగాణ‌లో న్యాయాధికారుల ఆందోళ‌న‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ రోజు 9 మంది న్యాయాధికారుల‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయాధికారులు క్రమశిక్ష‌ణారాహిత్యానికి పాల్ప‌డుతున్నారని హైకోర్టు పేర్కొంది. మరోవైపు న్యాయాధికారుల‌ సస్పెన్షన్ ను నిరసిస్తూ హైకోర్టు ముందు న్యాయ‌వాదుల‌ ఆందోళ‌న కొన‌సాగుతోంది. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి ఎందుకు లెట‌ర్ రాయడం లేద‌ని న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ప్రోత్సాహంతోనే తెలంగాణ న్యాయాధికారుల‌ను సస్పెండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News