: మమ్మల్నే అంటారా? విభజిస్తాం... వసతులెక్కడ?: కేసీఆర్ వ్యాఖ్యలపై న్యాయమంత్రి సదానందగౌడ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రాన్ని విమర్శించడం తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టును విభజించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, కేసీఆర్ లతో తాను చర్చలు జరిపానని ఆయన అన్నారు. ఏపీలో హైకోర్టుకు అవసరమైన మౌలిక వసతులు లేవని, తెలంగాణలో మరో ప్రాంతంలో హైకోర్టును నిర్వహించేందుకు మౌలిక వసతులు కల్పించలేదని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో ముందడుగు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నా, పరిస్థితులు ఇంకా అనుకూలించలేదని అన్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మౌలిక వసతులను చంద్రబాబు సర్కారు కల్పించిన పక్షంలో వెంటనే మారుస్తామని అన్నారు. నిజానిజాలు గుర్తించకుండా కేసీఆర్ తమను విమర్శిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజనకు సిద్ధంగా ఉన్నా, తమనే విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News