: సొంత పార్టీ నేతల ముప్పేట దాడితో వేదాంతం చెబుతున్న సుబ్రహ్మణ్యస్వామి


తన అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తిట్లు తిన్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు వేదాంతం వల్లిస్తున్నారు. "ప్రపంచం అన్ని రకాలుగా ఒకేలా ఉంటుంది. ఎక్కడ చిన్న మార్పు వచ్చినా, అది అన్ని విషయాలనూ ప్రభావితం చేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు: సుఖ దుఃఖే..." అని శ్లోకాలు గుర్తు చేసుకున్నారు. ఒకరు ఆక్షేపించడం మొదలు పెడితే, అందరూ అదే దారిలో నడుస్తారని తన ఆవేదనను వ్యక్తం చేశారు. స్వామి పేర్కొన్న శ్లోకం భగవద్గీతలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్లోకం. "సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ | తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి". దీని భావం ఏంటంటే... జయాపజయములను, లాభనష్టములను, సుఖ దుఃఖములను సమానముగా భావించి, యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. అంటే తాను యుద్ధం చేస్తున్నానని, తనను విమర్శించిన ప్రధానిపైనా విమర్శలు చేయవచ్చన్న భావం కలిగేలా ఈ శ్లోకం చెప్పడంపై నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. అన్నట్టు స్వామి ట్వీట్ ను 675 మంది రీట్వీట్ చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News