: ప్రకాశం జిల్లాలో కత్తుల స్వైర విహారం!... నడిరోడ్డుపై ముగ్గురు వ్యక్తుల హత్య!
ప్రకాశం జిల్లాలో కొద్దిసేపటి క్రితం కత్తులు స్వైర విహారం చేశాయి. రోడ్డుపై తమ దారిన తాము వెళుతున్న ముగ్గురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చేతుల్లో కత్తులు పట్టుకుని రంగంలోకి దిగిన సదరు దుండగులు ఆ ముగ్గురిని విచక్షణారహితంగా నరికేశారు. ఈ ఘటనలో బాధితులు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెన్నుబొట్ల అగ్రహారంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఘటన జరిగిన వెంటనే వచ్చిన దారినే దుండగులు వెళ్లిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చనిపోయినవారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.