: జమ్మూకాశ్మీర్ బీజేపీ నేత నివాసం వద్ద కలకలం.. ఏకే-47 ఎత్తుకెళ్లిన దుండగుడు
జమ్మూకాశ్మీర్ బీజేపీ నేత అబ్దుల్ రెహమాన్ నివాసం వద్ద ఓ దుండగుడు కలకలం సృష్టించాడు. అక్కడి బుద్గాం జిల్లా పంజాన్‌లోని రెహమాన్ నివాసంలోకి ఈరోజు ఉదయం ఓ వ్యక్తి చొరబడ్డాడు. రెహమాన్ నివాసంలోకి ఒక్కసారిగా ప్రవేశించిన దుండగుడు అటు ఇటూ తిరిగినట్లు సమాచారం. అనంతరం బీజేపీ నేత వ్యక్తిగత భద్రత అధికారి నుంచి దుండగుడు ఏకే-47ను ఎత్తుకెళ్లాడు. ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలిస్తున్నారు. దుండగుడిని త్వరలోనే పట్టుకొని ఏకే-47ను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.