: ఫిరాయింపులపై ప్రవేటు బిల్లు ప్రవేశపెట్టడమే లక్ష్యం: రాజ్యసభ సభ్యుడిగా సాయిరెడ్డి ప్రమాణం


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులన్నింటిలో ఏ2 ముద్దాయిగా ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ఆవరణలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ... సాయిరెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ లతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి... పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక ప్రైవేటు బిల్లును ప్రవేశపెడతానని ప్రకటించారు. అంతేకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న ఏపీ హామీలు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే... టీడీపీ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ నేడు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News