: సుబ్రహ్మణ్య స్వామి దెబ్బకు తట్టుకోలేక రెండు సమావేశాలు రద్దు చేసిన బీజేపీ


నిత్యమూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న సుబ్రహ్మణ్య స్వామిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయిన వేళ, ఆయన పాల్గొని ప్రసంగించాల్సిన రెండు సభలను బీజేపీ రద్దు చేసింది. ప్రధాని మోదీ స్వయంగా ఆయన వైఖరిని తప్పుబడుతూ, "వ్యవస్థ కన్నా తాము అధికులమని ఎవరైనా భావిస్తే, అతి తప్పు" అని మెత్తగా మొట్టిన సంగతి తెలిసిందే. పార్టీ నేతల నుంచి స్వామి ప్రసంగానికి అనుమతి పొందిన తరువాతే సమావేశాలకు ఆయన్ను ఆహ్వానించాలని స్పష్టమైన ఆదేశాలున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆయన మాట్లాడేందుకు అనుమతి లేకపోవడంతోనే రెండు కార్యక్రమాలను రద్దు చేసినట్టు వివరించారు. గతంలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై వ్యాఖ్యలు చేస్తున్నంత కాలం, చూస్తూ ఉండిన బీజేపీ, ఇటీవల ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ముంబైలో జరగాల్సిన ఓ కార్యక్రమాన్ని, చెన్నైలో ఆర్ఎస్ఎస్ తలపెట్టిన మరో ప్రోగ్రామ్ నూ రద్దు చేసుకున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండింటిలో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడాల్సి వుండగా, ఆయనేం వ్యాఖ్యలు చేస్తారోనన్న భయంతోనే వీటిని రద్దు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News