: నైజీరియన్ యువతి దెబ్బకు బెంబేలెత్తిన పోలీస్ బాస్!... వైరల్ గా బెంగళూరు వీడియో!


కొద్దిసేపటి క్రితం న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైన రెండు వీడియోలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీశాయి. ఓ వైపు ముంబైలో మద్యం మత్తు తలకెక్కిన ఓ యువతి పొట్టి డ్రెస్సులో పోలీసులను కాళ్లతో తన్నేందుకు యత్నిస్తూ కలకలం రేపితే... అదే సమయంలో బెంగళూరు సిటీలో జరిగిన మరో ఘటన మరింత కలకలం రేపింది. డ్రగ్స్ మత్తు తలకెక్కిన ఓ నైజీరియన్ యువతి... తనను నిలువరించేందుకు యత్నించిన ఓ పోలీసు అధికారిని వెంటాడింది. ఘటన వివరాల్లోకెళితే... మగాడిలా ప్యాంటు, టీ షర్ట్ తో రోడ్డుమీదకు వచ్చిన నైజీరియన్ యువతి తడబడుతూ నడుస్తోంది. ఏమైందని ఆరా తీస్తే... ఆ యువతి బాగానే ఉంది. డ్రగ్స్ మత్తు తలకెక్కిన నేపథ్యంలో రోడ్డుపై దాదాపుగా దొర్లుతూ నడుస్తోంది. దీనిని గమనించిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ఒక్కసారిగా ఎదురు తిరిగింది. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను బంధించేందుకు యత్నించగా, వారి యత్నాన్ని విఫలం చేసేందుకు ఆ యువతి కింద పడిపోయింది. కాళ్లతో పోలీసులను తంతూ నానా బీభత్సం చేసింది. ఆ తర్వాత పోలీసులు కాస్తంత విశ్రమించగా, అప్పటికే అక్కడికి చేరుకున్న ఓ పోలీసు అధికారి ఆమెకు వాస్తవ పరిస్థితిని వివరించబోయారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె సదరు పోలీసు అధికారిపై ఏకంగా దండయాత్ర చేసే రీతిలో దూసుకొచ్చింది. దీంతో సదరు అధికారి పరుగు లంకించుకున్నారు. ఆ తర్వాత మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వీడియో అన్ని న్యూస్ చానెళ్లలో ప్రముఖంగా ప్రసారమవుతోంది.

  • Loading...

More Telugu News