: రజనీ... ద గ్రేట్!: నదుల అనుసంధానానికి కోటి విరాళమిచ్చిన సూపర్ స్టార్!


అట్టడుగు స్థాయి నుంచి సినీ వినీలాకాశంలోకి అడుగుపెట్టిన రజనీకాంత్... తమిళ సినీ రంగంలోనే కాకుండా యావత్తు దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. వయసు మీదపడుతున్నా నటనలో తనకు తానే సాటి నిరూపించుకుంటూ వస్తున్న ఈ తమిళ సూపర్ స్టార్... తాజాగా ప్రజోపయోగ కార్యక్రమాలకు విరివిగా విరాళాలిచ్చే విషయంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. గతంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నదుల అనుసంధానం కోసం తన వంతుగా ఆయన రూ.1 కోటిని విరాళంగా ప్రకటించారు. సదరు మొత్తం ప్రభుత్వానికైతే చేరలేదు కాని, బ్యాంకులో భద్రంగా ఉంది. నదుల అనుసంధానం పనులు ప్రారంభం కాగానే ఈ నిధి సంబంధిత అధికారులకు చేరిపోతుందట. ఈ మేరకు రజనీ సాయాన్ని ఆయన సోదరుడు సత్యనారాయణ నిన్న చెన్నైలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News